![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -999 లో..... కావ్య ఎక్కడ సంతకం పెడుతుందోనని సుభాష్, అపర్ణ టెన్షన్ పడతారు. ఇందు వాళ్ళ అమ్మ కావ్య కూడా చాలా మొండిగా ఉండేది. ఎవరు ఏం చెప్పినా తను అనుకుందే చేస్తుంది. ఇప్పుడు ఇందు కూడా అలాగే తయారైందని సుభాష్, అపర్ణ అనుకుంటారు. ఇందుని మనం ఒప్పించలేం కానీ వాళ్ళ అమ్మ ఒప్పిస్తుందని అపర్ణ అనగానే వాళ్ళ అమ్మ లేదు కదా అని సుభాష్ అంటాడు. గతంలో కళ్యాణ్ తన వదిన కావ్య గురించి ఒక పుస్తకం రాసాడని.. గతం తాలూకా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది అపర్ణ.
గతంలో కావ్య తన గొప్పతనన్ని వివరిస్తూ కళ్యాణ్ ఒక బుక్ రాస్తాడు. ఆ పుస్తకాన్ని అపర్ణ తీసుకొని వచ్చి ఇందుకి ఇస్తుంది. ఇదేంటి నానమ్మ అని ఇందు అడుగుతుంది. ఇది మీ అమ్మ గురించి మీ బాబాయ్ కళ్యాణ్ రాసిన పుస్తకం.. అప్పుడు మీ అమ్మ అంటే ఏంటో తెలుస్తుందని ఇందు చేతికి అపర్ణ బుక్ ఇస్తుంది. మరొక వైపు రాహుల్, రుద్రాణి ఫోటో దగ్గరికి రేఖ వెళ్లి రేపటితో మీరు కన్న కల నిజమవుతుంది కానీ మీరు లేరని అనుకుంటూ రేఖ బాధపడుతుంది. అప్పుడే భ్రమరాంబ వచ్చి రేపు పార్టీ అంటున్నావ్.. అంతమందిలో ఆ ఇందు మనం సంతకం పెట్టమంటే పెడుతుందా అని భ్రమరాంబ అడుగుతుంది.
ఆ అపర్ణ వెనకాల ఉండి ఏదో నడిపిస్తుందని భ్రమరాంబ అంటుంది. ఇందు వాళ్ళ అమ్మ లాగే బంధాలు బంధుత్వాలు అంటూ ఎమోషనల్ అవుతుంది. ఈ ఇద్దరు ముసలి ప్రాణాలు మన చేతిలో ఉన్నంతవరకు ఇందు ధైర్యం చెయ్యదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఈ ఇందుకి ధైర్యం లేదు. అలాగే తోడు కావాలి. అది లేదు.. అలాంటప్పుడు ఏం చేస్తుంది. మనం చెప్పింది చెయ్యక తప్పదని భ్రమరాంబతో రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |